గణేష్న వరాత్రులు, నిమజ్జన ఏర్పాట్లపై బుధవారం ఖమ్మం కలెక్టర్ దివాకర్ టి.ఎస్. అధికారులతో, ఉత్సవ సమితి భాద్యులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా మున్నేరు నదిలో నీరు లేకపోవడంతో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు లైన్‌మెన్‌ల ద్వారానే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. నిమజ్జనం రోజున మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, అత్యవసర వైద్య సేవల కోసం మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.



