రాయవరం: తుమ్మెపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పోలేరమ్మ తల్లి జాతరలో రెండో రోజు బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను తలపై మోసుకుని పోలేరమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో కాపాడాలని, పంటలు సమృద్ధిగా పండాలని, సకాలంలో వర్షాలు కురవాలని పోలేరమ్మ తల్లిని భక్తులు ప్రార్థించారు. దీంతో తుమ్మెపల్లి గ్రామం భక్తి సందడితో కళకళలాడింది.
Uploaded Video:

