Tuesday, 8 September 2026
  • Home  
  • ఐటీడీఏ పీఓతో పాండు కరాటే అకాడమీ ప్రతినిధుల భేటీ
- అల్లూరి సీతారామరాజు

ఐటీడీఏ పీఓతో పాండు కరాటే అకాడమీ ప్రతినిధుల భేటీ

పాడేరు,ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ, ఐఏఎస్‌ను పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్,ఎగ్జామినర్ బాకూరు పాండు రాజు, కరాటే ఇన్‌స్ట్రక్టర్ దీప్తిక మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాండు కరాటే అకాడమీలో కరాటే శిక్షణ పొందుతూ హైదరాబాద్‌లో సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థినికి సివిల్స్ పరీక్షలకు సంబంధించిన మెలకువలు, పరీక్షలు ఎలా రాయాలి, ప్రణాళికాబద్ధంగా ఎలా సిద్ధం కావాలనే అంశాలపై ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ స్పష్టమైన అవగాహన కల్పించారు.అదేవిధంగా పాడేరు శ్రీకృష్ణాపురం బాలికల ఉన్నత పాఠశాల, గుత్తులపుట్టు బాలికల ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాల పురోగతిని పాండు కరాటే అకాడమీ ప్రతినిధులు ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.గిరిజన బాలికలకు ఆత్మరక్షణ విద్యలో ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తూ, వారి భద్రతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సహకరిస్తున్న ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీ ఆదిత్య వర్మ, ఐఏఎస్‌కు పాండు కరాటే అకాడమీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చీఫ్ ఇన్‌స్ట్రక్టర్, ఎగ్జామినర్ బాకూరు పాండు రాజు తెలిపారు.

పాడేరు,ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ, ఐఏఎస్‌ను పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్,ఎగ్జామినర్ బాకూరు పాండు రాజు, కరాటే ఇన్‌స్ట్రక్టర్ దీప్తిక మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పాండు కరాటే అకాడమీలో కరాటే శిక్షణ పొందుతూ హైదరాబాద్‌లో సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థినికి సివిల్స్ పరీక్షలకు సంబంధించిన మెలకువలు, పరీక్షలు ఎలా రాయాలి, ప్రణాళికాబద్ధంగా ఎలా సిద్ధం కావాలనే అంశాలపై ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ స్పష్టమైన అవగాహన కల్పించారు.అదేవిధంగా పాడేరు శ్రీకృష్ణాపురం బాలికల ఉన్నత పాఠశాల, గుత్తులపుట్టు బాలికల ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాల పురోగతిని పాండు కరాటే అకాడమీ ప్రతినిధులు ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.గిరిజన బాలికలకు ఆత్మరక్షణ విద్యలో ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తూ, వారి భద్రతతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సహకరిస్తున్న ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీ ఆదిత్య వర్మ, ఐఏఎస్‌కు పాండు కరాటే అకాడమీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చీఫ్ ఇన్‌స్ట్రక్టర్, ఎగ్జామినర్ బాకూరు పాండు రాజు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.