దివ్యంగా విద్యార్థులకు చేయూత అందించడంలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి సదానందం తెలిపారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ‘అలీంకో’ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచిత పరికరాల ఎంపిక శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన వారికి ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలు, వీల్‌చైర్లు తదితర పరికరాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులందరూ ఈ ఎంపిక ప్రక్రియకు తప్పనిసరిగా హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని DEO సదానందం, CMO ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శిబిరానికి అవసరమైన పత్రాలతో హాజరై నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.



