జనగామ పట్టణం వైష్ణవి గార్డెన్, ఎస్ వి నగర్ లో
శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.కాలనీలోని పిల్లలందరూ ఆటపాటలతో కృష్ణుని గోపిక వేషధారణ వేసుకుని కాలనిలో అందరు స్నేహపూర్వకంగా కల్మషం లేని హృదయంతో ఎంతో సంతోషంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడాన్ని కొనియాడారు. కాలనీలోని పెద్దలు అందరూ ఆటపాటలను,గోపికలు, కృష్ణా వేశాధారణ చూసి సంబర పడ్డారు, ఎంతగానో మురిసిపోయారు. ఇలాంటి పండుగలు,వేడుకల ద్వారా పిల్లలలో ఉన్న ఉత్సాహాన్ని వారిలోని పరిపక్వతను బయటికి తీసి వారి తీపి జ్ఞాపకాలు భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఎంతగానో దోహదపడుతాయాని వారి తల్లి దండ్రులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిల్లలు రేణుకుంట్ల సాన్వి,యశ్విత, అన్విత గోపికలు, శ్రీకృష్ణ వేశాధారణ లో అద్భుతంగా అలరించారు.తల్లి దండ్రులు రేణుకుంట్ల బాబా సనత్ కుమార్,సంధ్య,తాతయ్య నానమ్మ మురళి, రేఖ సంతోషం వ్యక్తం చేస్తూ పిల్లలను అభినందించారు.



