నంద్యాల: నంద్యాలలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పూర్వ విద్యార్థుల మహా సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. 50 బ్యాచ్లకు చెందిన దాదాపు 600 మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరై, తమ ఉపాధ్యాయులను ‘గురు వందన రథం’పై పూలవర్షం మధ్య ఊరేగింపుగా పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం ప్రమద నంది కళ్యాణ మండపంలో గురువులను శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. పాఠశాల పూర్వ వైభవానికి, అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని పూర్వ విద్యార్థులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నివర్తి మోహన్, విశ్రాంత, ప్రస్తుత ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ రామకృష్ణ విద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం