Saturday, 5 September 2026
  • Home  
  • శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్‌లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
- ఖమ్మం

శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్‌లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

ఖమ్మం శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ పోలీస్ సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్‌పర్సన్ నిష్టా శర్మ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠ్యాంశాలను బోధించి ఆకట్టుకున్న సోహిత్, ఆసియా ఫిర్దోస్, హర్షితలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ఐ కామరాజు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రాజు, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.