Saturday, 5 September 2026
  • Home  
  • మహిళలు మరియు బాలికల సమస్యలపై మౌనాన్ని వీడండి ఇతివృత్తంతో రౌండ్ టేబుల్ సమావేశం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మహిళలు మరియు బాలికల సమస్యలపై మౌనాన్ని వీడండి ఇతివృత్తంతో రౌండ్ టేబుల్ సమావేశం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్ళరేవు మండలం, కొత్తలంక గ్రామంలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు మరియు బాలికల సమస్యలపై మౌలాన్ని వీడండి అనే ఇతివృత్తంతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి చీఫ్ ఫంక్షనరీ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ మహిళలు మరియు బాలికలకు మద్దతుగా అనేక చట్టాలు ఉన్నా వాటిపై అవగాహన లేక అనేకమంది మహిళలు బాలికలు చట్టాలను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. యానిమేటర్ రత్నకుమారి మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉండాలని తద్వారా అన్యాయాలకు గురికాకుండా ఉంటారని,న్యాయపరమైన హక్కులను పొందే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండల సిబ్బందితోపాటు ప్రాజెక్టు పరిధిలోని మహిళలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.