Saturday, 5 September 2026
  • Home  
  • ఉపాధ్యాయ దినోత్సవం సందర్భముగా ప్రత్యేక కథనం
- ఖమ్మం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భముగా ప్రత్యేక కథనం

గురువే దేశ భవిష్యత్తుకు దిక్సూచి భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఈ రోజు భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించబడుతుంది. 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించిన రాధాకృష్ణన్ చిన్ననాటి నుంచే చదువుపై ఎంతో ఆసక్తి కనబరిచారు. తత్వశాస్త్రాన్ని అభ్యసించి, ఆ రంగంలో విశేషమైన పాండిత్యాన్ని సంపాదించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల, మైసూరు విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో అధ్యాపకుడిగా సేవలందించారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కూడా భారతీయ తత్వశాస్త్రాన్ని బోధించారు. విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, ఆలోచించే శక్తిని పెంపొందించడమే నిజమైన విద్య అని ఆయన విశ్వసించారు. 1962లో ఆయన భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలన్న తన విద్యార్థులు, అభిమానుల కోరికను గౌరవిస్తూ ఈ రోజును గురువులకు అంకితం చేశారు. గురువు సమాజానికి జ్ఞానాన్ని అందించే మార్గదర్శి. అందుకే డాక్టర్ రాధాకృష్ణన్ జీవితం, నేటి తరానికి కూడా ఆదర్శప్రాయమే… ఉపధ్యాయులకి ఉపాధ్యాయ దినోత్సవ. శుభాకాంక్షలు.

గురువే దేశ భవిష్యత్తుకు దిక్సూచి

భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఈ రోజు భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించబడుతుంది.

1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించిన రాధాకృష్ణన్ చిన్ననాటి నుంచే చదువుపై ఎంతో ఆసక్తి కనబరిచారు. తత్వశాస్త్రాన్ని అభ్యసించి, ఆ రంగంలో విశేషమైన పాండిత్యాన్ని సంపాదించారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల, మైసూరు విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో అధ్యాపకుడిగా సేవలందించారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కూడా భారతీయ తత్వశాస్త్రాన్ని బోధించారు.

విద్యార్థులను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, ఆలోచించే శక్తిని పెంపొందించడమే నిజమైన విద్య అని ఆయన విశ్వసించారు. 1962లో ఆయన భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలన్న తన విద్యార్థులు, అభిమానుల కోరికను గౌరవిస్తూ ఈ రోజును గురువులకు అంకితం చేశారు.

గురువు సమాజానికి జ్ఞానాన్ని అందించే మార్గదర్శి. అందుకే డాక్టర్ రాధాకృష్ణన్ జీవితం, నేటి తరానికి కూడా ఆదర్శప్రాయమే…
ఉపధ్యాయులకి ఉపాధ్యాయ దినోత్సవ. శుభాకాంక్షలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.