నంద్యాల: టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ జన్మదిన వేడుకలు శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఫిరోజ్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఫిరోజ్ ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అన్నదానం నిర్వహించడంతో పాటు పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు జరిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఫిరోజ్ పేర్కొన్నారు

ఘనంగా టీడీపీ నాయకుడు ఫిరోజ్ జన్మదిన వేడుకలు