పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం విశేష పూజలు వైభవంగా నిర్వహించారు పూర్వం సంస్కృత పాఠశాలగా ఉన్న పవిత్ర ప్రాంగణంలో కొలువైన అమ్మవారికి వేదొక్త శ్రావణ పూజలు నిర్వహించి వేద మంత్రాల నడుమ ప్రత్యేక సేవలు చేపట్టారు



