Saturday, 5 September 2026
  • Home  
  • పోసిబాబుకు పదవి రావడంపై మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు కృతజ్ఞతలు
- తూర్పు గోదావరి

పోసిబాబుకు పదవి రావడంపై మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు కృతజ్ఞతలు

తాళ్లపూడి, సెప్టెంబర్ 4: వైసీపీ తాళ్లపూడి మండల బీసీ సెల్ అధ్యక్షుడిగా పెండెం పోసిబాబును నియమించడంపై కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు వైసీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోసిబాబు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొల్లి దుర్గారావుతో పాటు పలువురు పార్టీ నాయకులు శుక్రవారం తలారి వెంకట్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యేకు పోసిబాబు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పదవులు లభించడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని నాయకులు పేర్కొన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయానికి మరింత కష్టపడి పనిచేస్తామని నూతన అధ్యక్షుడు పోసిబాబు తెలిపారు. కార్యక్రమంలో గజ్జరం గ్రామ కమిటీ అధ్యక్షుడు యెల్లిన శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ చిక్కాల మహేష్, దొండపాటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

తాళ్లపూడి, సెప్టెంబర్ 4: వైసీపీ తాళ్లపూడి మండల బీసీ సెల్ అధ్యక్షుడిగా పెండెం పోసిబాబును నియమించడంపై కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు వైసీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోసిబాబు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొల్లి దుర్గారావుతో పాటు పలువురు పార్టీ నాయకులు శుక్రవారం తలారి వెంకట్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన మాజీ ఎమ్మెల్యేకు పోసిబాబు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పదవులు లభించడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని నాయకులు పేర్కొన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయానికి మరింత కష్టపడి పనిచేస్తామని నూతన అధ్యక్షుడు పోసిబాబు తెలిపారు. కార్యక్రమంలో గజ్జరం గ్రామ కమిటీ అధ్యక్షుడు యెల్లిన శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ చిక్కాల మహేష్, దొండపాటి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.