సికింద్రాబాద్, సెప్టెంబర్ 04:
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్–కాగజ్నగర్ మధ్య రెండు జన సాధారణ (అన్రిజర్వ్డ్) ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారి శ్రీధర్ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
రైలు నంబర్ 07235 సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు కాగజ్నగర్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07236 రైలు కాగజ్నగర్ నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడం వల్ల సికింద్రాబాద్–ఉత్తర తెలంగాణ మధ్య ప్రయాణించే వారికి అదనపు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.


