శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల మైక్రోబయాలజీ విభాగం వారు 03-09-2026 తేదీన “బయోఇన్ఫర్మేటిక్స్” అనే అంశంపై శిక్షణా శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ వర్క్ షాప్ కు KL యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శ్రీనివాస బండారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు .
బయోఇన్ఫర్మేటిక్స్ రంగంలోని అంశాలపై [Databases – NCBI,
PDBJ, EMBL, Sequence Alignment – clustal W]
లోతైన అవగాహనను కలిగించడం, జీవశాస్త్ర పరిశోధనల్లో కంప్యూటర్ ఆధారిత
టెక్నిక్ల పాత్రను భవిష్యత్తులో ఉపాధి అవకాశాలను వివరించారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి వి దుర్గావతి శిక్షణ శిబిరంలకు ఎంతగానో సంతోషించి ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని విద్యార్థులకు ఉపయోగకరంగా నిర్వహిస్తామని తెలిపారు..
మైక్రోబయాలజీ విభాగాధిపతి శ్రీమతి N. సరిత మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు..
ఈ కార్యక్రమములో మైక్రోబయాలజీ అధ్యాపకులు CH. MEGHALA , MB శ్రీదేవి, వి.సుస్మిత మరియు విద్యార్థినిలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.




