నందలూరు మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నందలూరు మండల ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు, ప్రతి పంటకు నీరు అందేలా యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణానికి జలయజ్ఞం చేపట్టారని గుర్తు చేశారు. నిరుపేద విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, 104, 108 వంటి పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ముస్లిం మైనారిటీలకు 4 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిన ప్రజా నాయకుడని కొనియాడారు. ఇలాంటి ఎన్నో బృహత్తరమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన మహానుభావుడు, మన కడప జిల్లావాసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన సేవలను వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఐదేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుని విజయకేతనం ఎగురవేస్తుందని మేడా విజయభాస్కర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోబ్బిళ్ళ త్రినాధ్ యాదవ్, కోఆప్షన్ సభ్యుడు కలీముల్లా ఖాన్, ఎంపీటీసీలు పొత్తపి చంద్ర, సోమిశెట్టి ప్రభాకర్, జిల్లా అధికార ప్రతినిధి గుండు మల్లికార్జున రెడ్డి, వాలంటీర్స్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పునగాని గుణయాదవ్, ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి, పార్టీ మండల ఉపాధ్యక్షుడు షేక్ షావల్లి, ఇబ్బు, పాటూరు మోహన్ రెడ్డి, పాటూరు నరసింహ రెడ్డి, గుండు గోపాల్ రెడ్డి, పల్లె గ్రీష్మంత్ రెడ్డి, ముమ్మడి శెట్టి సుధాకర్, మంచా మురహరి, విజేయుడు, హస్తవరం సుబ్బారామిరెడ్డి, నల్లతిమ్మయపల్లి నరసారెడ్డి, మధురాజు, అరిగేల నాని, కాకి చంద్ర, నాగసుబ్బయ్య, దివాకర్ రెడ్డి, ఆనాల మధు యాదవ్, పుట్టా శంకర, సుబ్బరాజు, యముక దుర్గయ్య, పనతల గంగయ్య, కోర్లకుంట సుధాకర్, ఆంజనేయులు, గోల్డ్ మస్తాన్, పొత్తపి విజయ్ కుమార్, మోడపోతుల సుధాకర్, సురేంద్రబాబు, చింతకాయలపల్లి శంకర, అఖిల్, నవీన్, నాగి వెంకటసుబ్బయ్య, లేబాక వెంకటరమణ రెడ్డి, ఆడపూరు శ్రీనివాసరాజు, సుబ్రహ్మణ్యం రెడ్డి, బొక్కే మణి, మహిళా నాయకురాళ్లు వాణి, లక్ష్మీదేవి, అమ్మి, దేవి తదితరులు పాల్గొన్నారు.


