పవన్ కళ్యాణ్ పిలుపుతో సామాజిక సేవకు మరో అడుగు – భీమిలిలో అభిమానుల కోలాహలం
విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి ) సెప్టెంబర్ 2::: ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు భీమిలి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకులు, భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బమ్మిడి శ్రీ తారక్ గారు స్వయంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు.
అభిమానం మాటల్లో కాదు.. సేవలో చూపించాలనే సంకల్పంతో శ్రీ తారక్ రక్తదానం చేయడం పలువురి ప్రశంసలు అందుకుంది. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడమే ఆయనకు అందించే నిజమైన పుట్టినరోజు కానుక అని తారక్ పేర్కొన్నారు.
తారక్ సేవా స్ఫూర్తికి అభినందనలు
యువతలో సేవా భావాన్ని పెంపొందించేందుకు శ్రీ తారక్ నిరంతరం సామాజిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు నాయకులు, అభిమానులు కొనియాడారు. రక్తదానం, అవసరమైన వారికి అండగా నిలవడం, యువతను సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలతో సమాజానికి తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న తారక్, మరింత మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు.
“అభిమానం అంటే నినాదాలు మాత్రమే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన అభిమానం” అనే సందేశంతో తారక్ చేపట్టిన రక్తదాన కార్యక్రమం భీమిలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు.







