ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 2 ( పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా సర్వేపల్లి గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ ప్రజలకు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం: కాకాణి పూజిత
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 2 ( పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి: దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా సర్వేపల్లి గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ ప్రజలకు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

