*విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో వై.యస్ రాజశేఖరరెడ్డి గారి 17వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి గారు*
దివంగత నేత గౌ” శ్రీ వై.యస్ రాజశేఖరరెడ్డి రెడ్డి గారు 17వ వర్ధంతి కార్యక్రమం విశాఖపట్నం జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు,రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు గారు,PAC సభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు,శాసనమండలి సభ్యులు కుంభ రవిబాబు,వరుదు కల్యాణి గారు,మాజీ మంత్రి వర్యులు పసుపులేటి బాలరాజు గారు,మాజీ పార్లమెంటు సభ్యురాలు గొట్టేటి మాధవి గారు,మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్ గారు,తైనాల విజయ కుమార్ గారు,భాగ్యలక్ష్మీ గారు,సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి గారు,మొల్లి అప్పారావు గారు పాల్గొని డా” శ్రీ వై.యస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు,రాష్ట్ర,జిల్లా,నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


