వైరా /ఖమ్మం
ఖమ్మం జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన బొడ్డు రాంబాబు గౌడ్ తనపై నమ్మకంతో పదవి అప్పగించిన జిల్లా పార్టీ రథసారథి నెల్లూరి కోటేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కొణిజర్ల మండల అధ్యక్షులు కావిడ మురళి, జిల్లా ఉపాధ్యక్షులు బండారి నరేష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీ మరింత బలోపేతం, అభివృద్ధి, విస్తరణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బొడ్డు రాంబాబు గౌడ్ తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కార్యకర్తలతో కలిసి పనిచేస్తానన్నారు.



