Wednesday, 2 September 2026
  • Home  
  • *విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం
- విశాఖపట్నం

*విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం

*విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం* చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన ఘటన పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారక తెలుసుకున్నారు. బోర్‌వెల్ మోటార్‌కు అనుసంధానించిన తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చనేది ప్రాథమిక అంచనా అని అధికారులు తెలిపారు. ఏనుగు మృతి ఘటనపై విచారణ చేపట్టి, నివేదికను సమర్పించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. – ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయం

*విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి ఘటనపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం*

చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ ప్రాంత పరిధిలోని పాపిరెడ్డిగారిపల్లె వద్ద ఓ మామిడి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మగ ఏనుగు మృతి చెందిన ఘటన పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారక తెలుసుకున్నారు. బోర్‌వెల్ మోటార్‌కు అనుసంధానించిన తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగ ఏనుగుకు తగలడం, ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చనేది ప్రాథమిక అంచనా అని అధికారులు తెలిపారు. ఏనుగు మృతి ఘటనపై విచారణ చేపట్టి, నివేదికను సమర్పించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. వన్యప్రాణి నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఏనుగును ఖననం చేయాలని సూచించారు. వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగినంత ఎత్తులో ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు.
– ఉప ముఖ్యమంత్రివర్యుల వారి కార్యాలయం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.