Wednesday, 2 September 2026
  • Home  
  • పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుక-గిరిజన కుటుంబానికి స్వయం ఉపాధి
- తిరుపతి

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుక-గిరిజన కుటుంబానికి స్వయం ఉపాధి

శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 01, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పేట బ్రదర్స్’ మిత్రబృందం ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న చారిత్రాత్మక సేవా వేడుకలు అత్యంత మానవీయంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన మంగళవారం నాడు తొట్టంబేడు మండలానికి చెందిన ఒక అత్యంత నిరుపేద గిరిజన కుటుంబానికి శాశ్వత జీవనోపాధిని కల్పించేందుకు జనసేన పార్టీ ముఖ్య నాయకులు పేట చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ చూపారు. ఆ కుటుంబం స్వయం ఉపాధితో గౌరవంగా బతికేందుకు వీలుగా వారి యొక్క స్వంత ఖర్చులతో ఒక పక్కా వ్యాపార దుకాణాన్ని (షాపు) నిర్మించి ఇవ్వడమే కాకుండా, అందులో వ్యాపారానికి అవసరమైన సమగ్ర వస్తువులను సమకూర్చి వ్యాపారాన్ని ప్రారంభించి ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన శ్రేణులు మాట్లాడుతూ.. జనసేనాని ఆశయాలకు అనుగుణంగా కేవలం హంగు ఆర్భాటాల పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటూ, సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఈ ఐదు రోజుల ప్రత్యేక సేవా కార్యక్రమాలను రూపొందించినట్లు స్పష్టం చేశారు. ఈ ఐదు రోజుల్లో భాగంగా నియోజకవర్గవ్యాప్తంగా ఇప్పటికే అనేక అన్నదానాలు, నిరుపేద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ, మరియు అత్యవసర రక్తదాన శిబిరాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిరుపేద గిరిజన కుటుంబానికి శాశ్వత నీడ, ఉపాధి కల్పించిన జనసేన నేతల మానవత్వాన్ని స్థానిక ప్రజలు, గిరిజన సంఘాల ప్రతినిధులు హృదయపూర్వకంగా అభినందించారు. ఈ విశిష్ట ఉపాధి కల్పన సేవా కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు పేట చిరంజీవి, తేజ, గంధం శ్రీను, దినేష్, మనీ, ప్రదీప్ కుమార్, కళ్లిపూడి వెంకటేష్, నవీన్, దివాకర్, ముని చంద్ర, యుగంధర్, లక్ష్మీపతి, పసల ఎలిషా, జానీ, గోపి, రాజా, మరియు జనసేన వీర మహిళ, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కవిత తదితర ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.