Tuesday, 1 September 2026
  • Home  
  • నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్‌ఎమ్‌డి ఫరూక్
- నంద్యాల

నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఎన్‌ఎమ్‌డి ఫరూక్

నంద్యాల :రాష్ట్రవ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా నంద్యాల టౌన్ 26, 27 వార్డులైన దేవనగర్‌లో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎమ్‌డి ఫరూక్ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.1000, ఆపై రూ.2000 చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ను రూ.3,000 నుండి రూ.4,000కు పెంచి ప్రతినెల 1వ తేదీనే క్రమం తప్పకుండా అందిస్తున్నామని తెలిపారు. పింఛన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మెప్మా పీడీ వెంకట దాస్, ఎమ్మార్వో శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు దిలీప్ కుమార్, దస్తగిరి, వెంకటసుబ్బయ్య, ఇతర అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.