Saturday, 5 September 2026
  • Home  
  • బలభద్రపురంలో రూ.50 వేలతో బస్‌ షెల్టర్‌ నిర్మాణం
- తూర్పు గోదావరి

బలభద్రపురంలో రూ.50 వేలతో బస్‌ షెల్టర్‌ నిర్మాణం

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి బలభద్రపురం, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.50 వేలతో నిర్మించిన బస్‌ షెల్టర్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని ఐ ఫర్ గాడ్ ఫౌండేషన్, విజయప్రసాద్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో ఈ బస్‌ షెల్టర్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎండ, వర్షం నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించేలా బస్‌ షెల్టర్‌ నిర్మించడం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపడుతున్న పాస్టర్ విజయప్రసాద్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి, బిక్కవోలు మండల కూటమి నాయకులు, బలభద్రపురం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

బలభద్రపురం, ఆగస్టు 31 (పున్నమి ప్రతినిధి): బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.50 వేలతో నిర్మించిన బస్‌ షెల్టర్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని ఐ ఫర్ గాడ్ ఫౌండేషన్, విజయప్రసాద్ ఫౌండేషన్ సంయుక్త సహకారంతో ఈ బస్‌ షెల్టర్‌ను నిర్మించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎండ, వర్షం నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించేలా బస్‌ షెల్టర్‌ నిర్మించడం ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు చేపడుతున్న పాస్టర్ విజయప్రసాద్ రెడ్డిని అభినందించారు.

కార్యక్రమంలో పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి, బిక్కవోలు మండల కూటమి నాయకులు, బలభద్రపురం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.