శాంతిభద్రతలు, నేర నియంత్రణకు తొలి ప్రాధాన్యం – నూతన డీఎస్పీ
ఆత్మకూరు, ఆగస్టు 31: ఆత్మకూరు సబ్-డివిజన్ నూతన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా టీ. వెంకటేశ్వర్లు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సబ్-డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
పేకాట, జూదం, బెట్టింగ్, కోడి పందాలు, మట్కా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆత్మకూరు పట్టణంలో తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మీడియా మిత్రులు పోలీసు శాఖకు సహకరించాలని నూతన డీఎస్పీ కోరారు.


