పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విజయనగరం జోన్ చైర్మన్, అరకు టీడీపీ ఇన్చార్జ్ డా. సియ్యారి దొన్ను దొర సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు.
ఇటీవల అరకు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో సౌకర్యాలు లేవని అధికారులను నిలదీసిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
కాంప్లెక్స్‌లోని సౌకర్యాలపై ప్రయాణికులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ప్రవర్తన, మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సదుపాయం, ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


