Saturday, 29 August 2026
  • Home  
  • సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నరహరి ఏకగ్రీవం
- BHADRADRI

సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నరహరి ఏకగ్రీవం

వైరా: ఖమ్మం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలం గోపవరం గ్రామపంచాయతీ సర్పంచ్, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు అబ్బూరి నరహరి శనివారం ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి తనకు అప్పగించిన బాధ్యతపై కృతజ్ఞతలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లా సర్పంచులందరికీ నరహరి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి సర్పంచ్‌కు అండగా ఉంటానని చెప్పారు. సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జిల్లాలోని సర్పంచులందరినీ సమన్వయం చేసుకుంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ బాధ్యత దక్కేందుకు సహకరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నూతి సత్యనారాయణతో పాటు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వానికి నరహరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ సర్పంచులు, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, పీసీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

వైరా: ఖమ్మం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వైరా నియోజకవర్గం కొణిజర్ల మండలం గోపవరం గ్రామపంచాయతీ సర్పంచ్, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు అబ్బూరి నరహరి శనివారం ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి తనకు అప్పగించిన బాధ్యతపై కృతజ్ఞతలు తెలిపారు.
తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లా సర్పంచులందరికీ నరహరి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి సర్పంచ్‌కు అండగా ఉంటానని చెప్పారు. సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జిల్లాలోని సర్పంచులందరినీ సమన్వయం చేసుకుంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ బాధ్యత దక్కేందుకు సహకరించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నూతి సత్యనారాయణతో పాటు కాంగ్రెస్‌ అగ్రనాయకత్వానికి నరహరి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైరా నియోజకవర్గ సర్పంచులు, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, పీసీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.