నంద్యాల :గత ఎన్నికల సమయంలో ముస్లింలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆల్ ఇండియా తంజీమ్-యే-ఇన్సాఫ్ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి రామ్నాయక్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఇన్సాఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. రియాజ్ మాట్లాడుతూ.. 50 శాతం రాయితీతో మైనార్టీ రుణాలు, దుల్హన్ పథకానికి ₹1 లక్ష, నిరుద్యోగులకు ₹3 వేల భృతి, మహిళలకు ₹1,500 సాయం అందించాలని కోరారు. ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఇమామ్లు, మౌజన్లకు సకాలంలో గౌరవ వేతనాలు ఇవ్వాలని, ఆక్రమణకు గురైన వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు బాబా ఫక్రుద్దీన్, బాదుల్లా, కలాం, మహమ్మద్ అలీ పాల్గొన్నారు

ముస్లింల హామీలు అమలు చేయాలి: ఇన్సాఫ్