⛔రూ.12,500 జరిమానా విధించిన నాయుడుపేట కోర్టు
పున్నమి న్యూస్ నాయుడుపేట
తిరుపతి జిల్లా నాయుడుపేట హైవేపై మద్యం సేవించి కంటైనర్ లారీని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్‌కు నాయుడుపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 10 రోజుల జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించినట్లు నాయుడుపేట సిఐవెంకటేశ్వరరావు మీడియా సమావేశం తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో చెన్నై నుంచి నెల్లూరు వైపు జాతీయ రహదారిపై కంటైనర్ లారీ నంబర్ TN-88-J-2370ను డ్రైవర్ తియగరాజన్ అతివేగంగా, నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా నడుపుతున్నట్లు డయల్-112 ద్వారా పోలీసులకు
సమాచారం అందుకున్న వెంటనే నాయుడుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం. శివశంకర్ రావు, బీట్ సిబ్బందితో కలిసి మల్లాం జంక్షన్ సమీపానికి చేరుకుని లారీని అడ్డుకుని తనిఖీ చేశారు. బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా డ్రైవర్ మద్యం సేవించినట్లు నమోదైంది. దీంతో నిందితుడిపై నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు పూర్తి అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన నాయుడుపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుమారి పి. మీనాక్షి సుందరి నిందితుడికి 10 రోజుల జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా వాహనదారులు తమ ప్రాణాలతో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. మద్యం మత్తులో, అతివేగంగా, నిర్లక్ష్యంగా లేదా ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కోర్టు ద్వారా శిక్షలు పడేలా చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనం నడపాలని సూచించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి 10 రోజుల జైలు శిక్ష
⛔రూ.12,500 జరిమానా విధించిన నాయుడుపేట కోర్టు పున్నమి న్యూస్ నాయుడుపేట తిరుపతి జిల్లా నాయుడుపేట హైవేపై మద్యం సేవించి కంటైనర్ లారీని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్‌కు నాయుడుపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 10 రోజుల జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించినట్లు నాయుడుపేట సిఐవెంకటేశ్వరరావు మీడియా సమావేశం తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి సుమారు 1:30 గంటల సమయంలో చెన్నై నుంచి నెల్లూరు వైపు జాతీయ రహదారిపై కంటైనర్ లారీ నంబర్ TN-88-J-2370ను డ్రైవర్ తియగరాజన్ అతివేగంగా, నిర్లక్ష్యంగా, ప్రమాదకరంగా నడుపుతున్నట్లు డయల్-112 ద్వారా పోలీసులకు సమాచారం అందుకున్న వెంటనే నాయుడుపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎం. శివశంకర్ రావు, బీట్ సిబ్బందితో కలిసి మల్లాం జంక్షన్ సమీపానికి చేరుకుని లారీని అడ్డుకుని తనిఖీ చేశారు. బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా డ్రైవర్ మద్యం సేవించినట్లు నమోదైంది. దీంతో నిందితుడిపై నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు పూర్తి అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన నాయుడుపేట జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుమారి పి. మీనాక్షి సుందరి నిందితుడికి 10 రోజుల జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా వాహనదారులు తమ ప్రాణాలతో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని తెలిపారు. మద్యం మత్తులో, అతివేగంగా, నిర్లక్ష్యంగా లేదా ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కోర్టు ద్వారా శిక్షలు పడేలా చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనం నడపాలని సూచించారు.

