Saturday, 29 August 2026
  • Home  
  • కోవిడ్ సేవల్లో మృతి చెందిన సెక్యూరిటీ గార్డు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత
- జయశంకర్ భూపాలపల్లి

కోవిడ్ సేవల్లో మృతి చెందిన సెక్యూరిటీ గార్డు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత

తేదీ :27-08-2026 గురువారం రోజున భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగులకు మరియు ప్రజలకు సేవలందించి, కరోనా బారినపడి మృతి చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు సుల్తాన్ రాజశేఖర్ కుటుంబానికి సింగరేణి యాజమాన్యం అండగా నిలిచింది. ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారు, మృతుడు సుల్తాన్ రాజశేఖర్ కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్‌ను అందజేశారు. సుల్తాన్ రాజశేఖర్ 01-08-2017న M/s గోర్ఖా సెక్యూరిటీ ఫోర్స్ ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరారు. కోవిడ్-19 సమయంలో విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు సేవలందిస్తూ, 03-07-2021న కరోనా కారణంగా మృతి చెందారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన రాజశేఖర్ సేవలను ఈ సందర్భంగా జీఎం గారు గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబానికి అండగా నిలవడం సింగరేణి యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్ , ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మురళిమోహన్ , సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తేదీ :27-08-2026 గురువారం రోజున భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో విధులు నిర్వహిస్తూ ఉద్యోగులకు మరియు ప్రజలకు సేవలందించి, కరోనా బారినపడి మృతి చెందిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు సుల్తాన్ రాజశేఖర్ కుటుంబానికి సింగరేణి యాజమాన్యం అండగా నిలిచింది.
ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారు, మృతుడు సుల్తాన్ రాజశేఖర్ కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్‌ను అందజేశారు.
సుల్తాన్ రాజశేఖర్ 01-08-2017న M/s గోర్ఖా సెక్యూరిటీ ఫోర్స్ ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరారు. కోవిడ్-19 సమయంలో విధి నిర్వహణలో భాగంగా ప్రజలకు సేవలందిస్తూ, 03-07-2021న కరోనా కారణంగా మృతి చెందారు.
కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించిన రాజశేఖర్ సేవలను ఈ సందర్భంగా జీఎం గారు గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబానికి అండగా నిలవడం సింగరేణి యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమములో పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్ , ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ మురళిమోహన్ , సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.