Friday, 28 August 2026
  • Home  
  • ఆర్సీ పురంలో పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు నిల్
- తిరుపతి

ఆర్సీ పురంలో పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు నిల్

రామచంద్రాపురం ఆగస్టు 27 పున్నమి ప్రతినిధి రామచంద్రపురం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఎంపీడీవో పులిరామ్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల రకు రామచంద్రాపురం మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 136 పోలింగ్ కేంద్రాల జాబితాను ఈ నెల 23న అధికారులు విడుదల చేశారు. పోలింగ్ కేంద్రాల జాబితాపై ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పరిశీలించి అభ్యంతరాలు ఉంటే మూడు రోజులలోపు అధికారులకు తెలియజేయాలని అధికారులు అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల దూరం, భవనాల అనుకూలత, ఓటర్లకు అందుబాటులో ఉండే పరిస్థితులు తదితర అంశాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. అయితే నిర్ణీత మూడు రోజుల గడువు పూర్తయినప్పటికీ మండలంలోని ఏ గ్రామం నుంచి కూడా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు గానీ పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ఎంపీడీవో పులిరామ్ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే ప్రకటించిన 136 పోలింగ్ కేంద్రాల జాబితాపై ఎలాంటి మార్పులు, అభ్యంతరాలు లేకుండా ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు

రామచంద్రాపురం ఆగస్టు 27 పున్నమి ప్రతినిధి

రామచంద్రపురం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఎంపీడీవో పులిరామ్ సింగ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల
రకు రామచంద్రాపురం మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 136 పోలింగ్ కేంద్రాల జాబితాను ఈ నెల 23న అధికారులు విడుదల చేశారు.
పోలింగ్ కేంద్రాల జాబితాపై ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పరిశీలించి అభ్యంతరాలు ఉంటే మూడు రోజులలోపు అధికారులకు తెలియజేయాలని అధికారులు అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల దూరం, భవనాల అనుకూలత, ఓటర్లకు అందుబాటులో ఉండే పరిస్థితులు తదితర అంశాలపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు.
అయితే నిర్ణీత మూడు రోజుల గడువు పూర్తయినప్పటికీ మండలంలోని ఏ గ్రామం నుంచి కూడా, ఏ రాజకీయ పార్టీ నాయకుడు గానీ పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ఎంపీడీవో పులిరామ్ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే ప్రకటించిన 136 పోలింగ్ కేంద్రాల జాబితాపై ఎలాంటి మార్పులు, అభ్యంతరాలు లేకుండా ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లను కొనసాగిస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.