Friday, 28 August 2026
  • Home  
  • వైద్య ఆరోగ్య సేవలపై అధికారుల తనిఖీలు
- జనగాం

వైద్య ఆరోగ్య సేవలపై అధికారుల తనిఖీలు

జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలపై అధికారుల తనిఖీలు – ఏఆర్టీ సెంటర్ సందర్శన ———————————————————— జనగామ, ఆగష్టు 26,పున్నమి జిల్లా ప్రతినిధి : జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ వనపర్తి, దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు, చిన్నమడూరు, పెద్దమడూరు, సింగరాజుపల్లి ఆరోగ్య ఉప కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య ఉప కేంద్రాలలో నిర్వహిస్తున్న మాతా శిశు కార్యక్రమాలు, టీకాల కార్యక్రమాలు, NCD కార్యక్రమాలు, TB కార్యక్రమాలు, కాలానుగుణ వ్యాధుల నియంత్రణ చర్యలు మరియు మందుల నిల్వలను పరిశీలించి, వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారాలలోపు నమోదు చేయాలని, 30 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ అసంక్రమిత వ్యాధుల (NCD) నివారణలో భాగంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా మందులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా 0–15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందించాలని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (HPV) నిరోధక టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, కాలానుగుణ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. *ART సెంటర్ సందర్శన* అనంతరం ఎయిడ్స్ కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ డా. అనురాధ, జిల్లాలోని ART సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ART సెంటర్‌లో అందిస్తున్న వైద్య సేవలు, కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ వనపర్తి, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. శ్రావ్య, డా. సిద్ధార్థ, DPM మాధురి, తదితరులు పాల్గొన్నారు. *41వ నేత్రదాన పక్షోత్సవాల ప్రారంభం* అదే విధంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ, జనగాం ఆధ్వర్యంలో జనగాం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 41వ నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి దృష్టిని అందించే అవకాశం ఉన్నందున, నేత్రదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి పాల్గొన్నారు.

జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలపై అధికారుల తనిఖీలు – ఏఆర్టీ సెంటర్ సందర్శన
————————————————————
జనగామ, ఆగష్టు 26,పున్నమి జిల్లా ప్రతినిధి :
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ వనపర్తి, దేవరుప్పుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు, చిన్నమడూరు, పెద్దమడూరు, సింగరాజుపల్లి ఆరోగ్య ఉప కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్య ఉప కేంద్రాలలో నిర్వహిస్తున్న మాతా శిశు కార్యక్రమాలు, టీకాల కార్యక్రమాలు, NCD కార్యక్రమాలు, TB కార్యక్రమాలు, కాలానుగుణ వ్యాధుల నియంత్రణ చర్యలు మరియు మందుల నిల్వలను పరిశీలించి, వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు.
ప్రతి గర్భిణీ స్త్రీని 12 వారాలలోపు నమోదు చేయాలని, 30 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ అసంక్రమిత వ్యాధుల (NCD) నివారణలో భాగంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా మందులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదే విధంగా 0–15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందించాలని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (HPV) నిరోధక టీకాపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, కాలానుగుణ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

*ART సెంటర్ సందర్శన*

అనంతరం ఎయిడ్స్ కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ డా. అనురాధ, జిల్లాలోని ART సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ART సెంటర్‌లో అందిస్తున్న వైద్య సేవలు, కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ వనపర్తి, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. శ్రావ్య, డా. సిద్ధార్థ, DPM మాధురి, తదితరులు పాల్గొన్నారు.
*41వ నేత్రదాన పక్షోత్సవాల ప్రారంభం*
అదే విధంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ, జనగాం ఆధ్వర్యంలో జనగాం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 41వ నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నేత్రదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేత్రదానం ద్వారా చూపును కోల్పోయిన వారికి దృష్టిని అందించే అవకాశం ఉన్నందున, నేత్రదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా అంధత్వ నివారణ సంస్థ అధికారి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.