మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ముహమ్మద్ అంజద్ పాషాకు ఘన సన్మానం
———————————————————
జనగామ, ఆగష్టు 26,పున్నమి ప్రతినిధి :
తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా నియమితులైన ముహమ్మద్ అంజద్ పాషా కు జనగామ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించారు.
జనగామ జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ , నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి అంజద్ పాషా శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, మైనారిటీ వర్గాల సమస్యల పరిష్కారానికి అంజద్ పాషా గారు కృషి చేయాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ మాట్లాడుతూ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గా నియమించినందుకు మల్లన్న, మరియు రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు సల్మాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు, జిల్లా కార్యదర్శి మంద దిలీప్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీసా శ్రీధర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి, పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎం.డి. పాషా తదితర నాయకులు పాల్గొన్నారు.


