సెప్టెంబర్‌లో తిరుమల శ్రీవారి దర్శనం కోరుకునే భక్తులకు టీటీడీ మరో అవకాశం కల్పిస్తోంది. ఆగస్టు 26 ఉదయం 10 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను విడుదల చేయనుంది. రూ.1,600తో టికెట్ బుక్ చేసుకుంటే ఇద్దరు భక్తులు హోమంలో పాల్గొని అదే రోజు మధ్యాహ్నం రూ.300 ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలిపిరిలోని సప్తగోప్రదక్షిణశాలలో హోమం నిర్వహిస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అయితే టికెట్ల సంఖ్య పరిమితంగా ఉండటంతో త్వరగా బుక్ చేసుకోవడం మంచిది.

రూ.300 దర్శనం టికెట్ దక్కలేదా? టీటీడీ మరో అవకాశం