అమరావతి, ఆగస్టు 24 (పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా నల్లమిల్లి మనోజ్‌రెడ్డి నియమితులైన సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి సోమవారం ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజమౌళి ఐఏఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఐఏఎస్, ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న ఐఏఎస్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మనోజ్‌రెడ్డికి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బాధ్యతలు లభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై పరస్పరం చర్చించినట్లు తెలిపారు.
ఈ భేటీలో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

