వార్త ముఖ్యాంశాలు
- తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, అక్టోబర్ -08 (పున్నమి ప్రతినిధి) తూర్పు గోదావరి జిల్లా లో వ్యాప్తంగా మిగిలిపోయిన 4 ప్రభుత్వ మద్యం షాపుల లైసెన్స్‌ల కేటాయింపు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.
- ఈ షాపులకు సంబంధించి గురువారం ఉదయం 8 గంటలకు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బహిరంగంగా లాటరీ (లక్కీ డ్రా) నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై.
- శ్రీలత అధికారికంగా వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, అక్టోబర్ -08 (పున్నమి ప్రతినిధి) తూర్పు గోదావరి జిల్లా లో వ్యాప్తంగా మిగిలిపోయిన 4 ప్రభుత్వ మద్యం షాపుల లైసెన్స్‌ల కేటాయింపు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ షాపులకు సంబంధించి గురువారం ఉదయం 8 గంటలకు రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బహిరంగంగా లాటరీ (లక్కీ డ్రా) నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వై. శ్రీలత అధికారికంగా వెల్లడించారు. జిల్లాలోని ఈ 4 మద్యం దుకాణాల కోసం దరఖాస్తుదారులు గట్టిగానే పోటీ పడ్డారు. మొత్తం కలిపి 30 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
* కడియానికి: అత్యధికంగా ఒకే షాపునకు 13 దరఖాస్తులు వచ్చాయి.
* మండపేట రూరల్‌కు: ఇక్కడి షాపు కోసం 9 దరఖాస్తులు అందాయి.
* బిక్కవోలుకు: ఈ ప్రాంత దుకాణానికి 4 దరఖాస్తులు వచ్చాయి.
* కొవ్వూరు రూరల్‌కు: ఇక్కడి షాపునకు కూడా 4 దరఖాస్తులు దాఖలయ్యాయి.
లాటరీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్ణీత సమయానికి తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయానికి హాజరు కావాలని ఆమె స్పష్టం చేశారు.