Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు దుర్మరణం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు దుర్మరణం

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం, అక్టోబర్ -08 (పున్నమి ప్రతినిధి) తూర్పు గోదావరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
  • నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
  • స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం, అక్టోబర్ -08 (పున్నమి ప్రతినిధి) తూర్పు గోదావరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంసాలిపాలెం సమీపంలో వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తీవ్రతకు ఇద్దరూ ఘటన స్థలంలోనే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, కొడుకు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో వాహనాలు నిలిచిపోయి, ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న నిడదవోలు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
మృతులు ఎవరు? వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రమాదానికి కారణమైన వాహనం ఏది? అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *