Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
East Godavari

చర్చి వెనక పెద్దపులి కలకలం.. భయాందోళనలో స్థానికులు

Punnami Newsroom Published:
చర్చి వెనక పెద్దపులి కలకలం.. భయాందోళనలో స్థానికులు

Story highlights

  • తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి, అక్టోబర్ -08 (పున్నమి ప్రినిది) తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం రోజురోజుకూ విస్తరిస్తూ స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
  • తాజాగా దేవరపల్లి మండలం గౌరీపట్నం మేరీ మాత చర్చి వెనుక భాగంలో ఉన్న క్వారీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ఈరోజు (గురువారం) అధికారికంగా గుర్తించారు.
  • చర్చి పరిసరాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి, అక్టోబర్ -08 (పున్నమి ప్రినిది) తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం రోజురోజుకూ విస్తరిస్తూ స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా దేవరపల్లి మండలం గౌరీపట్నం మేరీ మాత చర్చి వెనుక భాగంలో ఉన్న క్వారీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ఈరోజు (గురువారం) అధికారికంగా గుర్తించారు. చర్చి పరిసరాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీతానగరం నుండి దేవరపల్లి వరకు జిల్లాలో కొన్ని రోజుల క్రితం సీతానగరం మండలంలో మొదలైన ఈ పెద్దపులి సంచారం, ఆ తర్వాత తాళ్లపూడి, గోపాలపురం మండలాల మీదుగా ప్రయాణిస్తూ ప్రస్తుతం దేవరపల్లి పరిసర ప్రాంతాలకు చేరుకుంది. పులి నిరంతరం తన స్థానాన్ని మార్చుకుంటూ గ్రామాల వైపు వస్తుండటంతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. పులి కదలికలపై అటవీ శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. క్వారీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నందున, అక్కడి క్వారీ కార్మికులు ఎవరూ కూడా పనుల నిమిత్తం ఒంటరిగా వెళ్లవద్దని అధికారులు గట్టిగా సూచించారు. ప్రస్తుతం అటవీ శాఖకు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, పులిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో ప్రత్యేక గాలింపు చర్యలు (సెర్చ్ ఆపరేషన్) ముమ్మరం చేశాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *