జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 14 ఎకరాల 10 గుంటల దేవాదాయ భూమిని తక్షణమే సర్వే చేసి, సరిహద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షించాలని ఆకుల సతీష్ టీమ్ డిమాండ్ చేసింది.
తెలంగాణ హైకోర్టు W.P.No.40409/2025లో 10-04-2026న ఇచ్చిన ఆదేశాల ప్రకారం రెవెన్యూ, ఎండోమెంట్స్, సర్వే అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి భూమిని పరిరక్షించాల్సి ఉందని ఆకుల సతీష్ తెలిపారు. దేవాలయాలకు రాకపోకల కోసం రహదారి కల్పించడంతో పాటు, దేవాదాయ భూముల ఆక్రమణలు, అక్రమ విక్రయాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
పది రోజుల్లో సర్వే, ఫెన్సింగ్ పనులు ప్రారంభించకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజలతో కలిసి భారీ నిరసన చేపడతామని, కోర్టు ఆదేశాల అమలుకు మరోసారి హైకోర్టును ఆశ్రయిస్తామని ఆకుల సతీష్ హెచ్చరించారు.
“దేవుడి మాన్యం భూమిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత. కోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేయాలి.”
— ఆకుల సతీష్ టీమ్


