డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్ళరేవు సంత మార్కెట్ నందు అగ్నిప్రమాదం సంభవించి మూడు ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. బాధిత కుటుంబాలను శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆదివారం పరామర్శించి వారికి నిత్యావసరాలు, వస్త్రాలు అవసరమైన సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు ప్రభుత్వ గృహాలను మంజూరు చేయడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, సీనియర్ నాయకులు మందాల గంగ సూర్యనారాయణ,టేకుమూడి లక్ష్మణరావు,మేడిశెట్టి సత్తిబాబు,వాసంశెట్టి శ్రీనివాస్,అద్దేపల్లి సతీష్, మందపాటి సతీష్,కుడుపూడి దుర్గాప్రసాద్, గాదిరాజు సత్యనారాయణ రాజు,గంజా సూరిబాబు,ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

తాళ్లరేవులో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన శాసనసభ విప్ దాట్ల సుబ్బరాజు