ఆనం, వేమిరెడ్డి దంపతుల సహకారంతో నేత్ర వైద్య సేవలు
ఖాదర్పూర్ పంచాయతీ సన్నువారిపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు గుమ్మా రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో వీఐపీర్-నేత్ర కంటి వైద్య సేవల కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి సహకారంతో ఈ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో 130 మంది గ్రామస్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, 67 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమం పట్ల గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. టీడీపీ యువ నాయకులు చాగం సుబ్బారెడ్డి, దుద్దుగుంట వెంకటరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

సన్నువారిపల్లెలో వీఐపీర్ నేత్ర కంటి వైద్య శిబిరం
ఆనం, వేమిరెడ్డి దంపతుల సహకారంతో నేత్ర వైద్య సేవలు ఖాదర్పూర్ పంచాయతీ సన్నువారిపల్లె గ్రామంలో టీడీపీ నాయకులు గుమ్మా రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో వీఐపీర్-నేత్ర కంటి వైద్య సేవల కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి సహకారంతో ఈ శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో 130 మంది గ్రామస్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, 67 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమం పట్ల గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. టీడీపీ యువ నాయకులు చాగం సుబ్బారెడ్డి, దుద్దుగుంట వెంకటరెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

