నక్కర్త మేడిపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని గోదాసు సుష్మకు ఘన సన్మానం
మండల్ టాపర్‌గా ప్రతిభ చాటిన సుష్మకు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అభినందనలు
పున్నమి న్యూస్ ప్రతినిధి
01 మే 2026
తెలంగాణ ఇంచార్జి
రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం నియోజకవర్గం నక్కర్త మేడిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాల (ZPHS) విద్యార్థిని గోదాసు సుష్మ పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మండల్ టాపర్‌గా నిలిచింది. మొత్తం 600 మార్కుల్లో 559 మార్కులు సాధించి తన ప్రతిభను చాటడంతో పాటు పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారు సుష్మను ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సన్మానించారు. విద్యార్థిని కృషి, పట్టుదల, గురువుల మార్గదర్శకత వల్లే ఈ విజయం సాధ్యమైందని ఎమ్మెల్యే ప్రశంసించారు.
సాధారణ కుటుంబానికి చెందిన సుష్మ తండ్రి గోదాసు యాదయ్య (RTC కండక్టర్) కష్టాలను దాటుకుని తన కూతురిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం గర్వకారణమని ఆయన అన్నారు. ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని సుష్మను అభినందించారు. సుష్మ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అందరూ ఆకాంక్షించారు.


