హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకుటూరులోని జిల్లా కేంద్ర కారాగారంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి వై.జె. పద్మశ్రీ ఖైదీల యోగక్షేమాలు, భోజనం, వైద్య సదుపాయాలు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయవాది లేని ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. అనంతరం రిజిస్టర్లు, గ్రీవెన్స్ బాక్స్ పరిశీలించి, మహిళా ఖైదీల సమస్యలను తెలుసుకున్నారు. కొందరు ఖైదీలకు కంటి అద్దాలు పంపిణీ చేశారు.





