దొరవారిసత్రం:-– ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై దొరవారిసత్రం మండలంలోని కూటమి నాయకులు హర్షం వ్యక్తంచేశారు. శనివారం దొరవారిసత్రం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు బీసీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ…
దివంగత మహానేత ఎన్టీఆర్ గారు బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అండగా నిలిచి రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే
గత ప్రభుత్వం జీవో నెం. 559, 560లతో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి దాదాపు 16,800 మంది బీసీ ప్రతినిధుల రాజకీయ అవకాశాలను దెబ్బతీశారన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ మేరకు… నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు తిరిగి 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఇంకా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ…బీసీ ల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఇట్టగుంట రత్నయ్య, క్లస్టర్ ఇంచార్జి సంచి విజయకుమార్, మైనారిటి సెల్ నాయకులు SKషబ్బీర్, బట్టా శ్రీనివాసులు, సమాధి సుబ్రమణ్యం, ఊపాటి చెంగయ్య, నేలపట్టు రామయ్య, విజయభాస్కర్, నరసింహులు,యాబాక వెంకటస్వామి, గడ్డాం మంగయ్య, skబాబర్, కాటూరు మణి, పొంకం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

బీసీల కు 34% రిజర్వేషన్లు పునరుద్ధరణపై హర్షం వ్యక్తంచేసిన దొరవారిసత్రం నాయకులు
దొరవారిసత్రం:-– ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై దొరవారిసత్రం మండలంలోని కూటమి నాయకులు హర్షం వ్యక్తంచేశారు. శనివారం దొరవారిసత్రం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు బీసీ నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ… దివంగత మహానేత ఎన్టీఆర్ గారు బీసీలకు రాజకీయంగా, సామాజికంగా అండగా నిలిచి రాజ్యాధికారంలో సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేశారు. అయితే గత ప్రభుత్వం జీవో నెం. 559, 560లతో బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించి దాదాపు 16,800 మంది బీసీ ప్రతినిధుల రాజకీయ అవకాశాలను దెబ్బతీశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ మేరకు… నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు తిరిగి 34% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బీసీల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఇంకా పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ…బీసీ ల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఇట్టగుంట రత్నయ్య, క్లస్టర్ ఇంచార్జి సంచి విజయకుమార్, మైనారిటి సెల్ నాయకులు SKషబ్బీర్, బట్టా శ్రీనివాసులు, సమాధి సుబ్రమణ్యం, ఊపాటి చెంగయ్య, నేలపట్టు రామయ్య, విజయభాస్కర్, నరసింహులు,యాబాక వెంకటస్వామి, గడ్డాం మంగయ్య, skబాబర్, కాటూరు మణి, పొంకం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

