తేదీ: 22-08-2026 | పున్నమి రిపోర్టర్
ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యం: సర్పంచ్ దుర్గం సంధ్య
రెబ్బెన మండలం: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం మడవాయిగూడ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దుర్గం సంధ్య (మహేష్) ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరిగింది.
“ఆరోగ్యమే మహాభాగ్యం” అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ క్యాంప్‌లో గ్రామ ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన సమయంలో వైద్యులను సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దుర్గం సంధ్య మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామ ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, సమస్యలు ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో MLHP ఋషిత, సర్పంచ్ దుర్గం సంధ్య, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, యువ నాయకుడు చల్లూరి నాగేష్, ANM తులసి, ఆశా కార్యకర్తలు నిర్మల, శకుంతల, శ్రీకాంత్ తదితరులు పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు.

మడవాయిగూడలో ఉచిత మెడికల్ క్యాంప్
తేదీ: 22-08-2026 | పున్నమి రిపోర్టర్ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యం: సర్పంచ్ దుర్గం సంధ్య రెబ్బెన మండలం: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం మడవాయిగూడ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని మెడికల్ క్యాంప్ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దుర్గం సంధ్య (మహేష్) ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరిగింది. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ క్యాంప్‌లో గ్రామ ప్రజలకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. అవసరమైన వారికి మందులు కూడా పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన సమయంలో వైద్యులను సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దుర్గం సంధ్య మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని, గ్రామ ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, సమస్యలు ఎదురైనప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో MLHP ఋషిత, సర్పంచ్ దుర్గం సంధ్య, పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్, యువ నాయకుడు చల్లూరి నాగేష్, ANM తులసి, ఆశా కార్యకర్తలు నిర్మల, శకుంతల, శ్రీకాంత్ తదితరులు పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు.

