కులాలను రెచ్చగొట్టి సమాజాన్ని విడదీయడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆరోపించారు. చిట్వేలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. దేశం, సమాజం అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తిని కులాల చట్రంలో బంధించవద్దని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని అన్నారు.
శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త కొట్టె సాయిపై జరిగిన ఘటన అనంతరం పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి పరామర్శించడం ద్వారా పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారని తెలిపారు. అనంతరం అదే కార్యకర్తకు శ్రీకాళహస్తి ఛైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా సాధారణ కార్యకర్తలకు కూడా గుర్తింపు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని, కాపు కల్యాణ మండపాల నిర్మాణాలు నిలిపివేశారని, విద్యార్థులకు స్కాలర్షిప్లు, విదేశీ విద్యకు తగిన సహాయం అందలేదని ఆరోపించారు. ఇప్పటికైనా కుల విద్వేషాలను ప్రోత్సహించడం మానుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్‌పై కులపరమైన విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా తన సొంత నియోజకవర్గంలోనే పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తిరుపతిలో పోటీ చేసినా ఎదుర్కొనే ధైర్యం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు.
కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించిన ఆయన, అప్పట్లో వైసీపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కోనసీమ ఘటనలు, కాపు యువకుడు వెంగయ్య మరణం వంటి సందర్భాల్లో కూడా వైసీపీ నేతలు స్పందించలేదని విమర్శించారు. ఎంత ప్రచారం చేసినా నిజాయితీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ వెంటే కాపు సామాజికవర్గం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మాదాసు నరసింహ, మద్దూరి మన్మధ, పెద్దంగారి సాయి, కావేరి అవినాష్, మాదాసు శివ, ఆనందల తేజ, కొనిశెట్టి చక్రి, సువారపు హరిప్రసాద్, మాదినేని రాజా తదితర జనసేన నాయకులు, కాపు యువత పాల్గొన్నారు.

కులాలను రెచ్చగొట్టి సమాజాన్ని విడదీయడమే వైసీపీ లక్ష్యం: ఎమ్మెల్యే అరవ శ్రీధర్
కులాలను రెచ్చగొట్టి సమాజాన్ని విడదీయడమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆరోపించారు. చిట్వేలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కుల రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు. దేశం, సమాజం అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తిని కులాల చట్రంలో బంధించవద్దని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని అన్నారు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్త కొట్టె సాయిపై జరిగిన ఘటన అనంతరం పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి పరామర్శించడం ద్వారా పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారని తెలిపారు. అనంతరం అదే కార్యకర్తకు శ్రీకాళహస్తి ఛైర్మన్ పదవి ఇవ్వడం ద్వారా సాధారణ కార్యకర్తలకు కూడా గుర్తింపు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారని, కాపు కల్యాణ మండపాల నిర్మాణాలు నిలిపివేశారని, విద్యార్థులకు స్కాలర్షిప్లు, విదేశీ విద్యకు తగిన సహాయం అందలేదని ఆరోపించారు. ఇప్పటికైనా కుల విద్వేషాలను ప్రోత్సహించడం మానుకోవాలని, లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్‌పై కులపరమైన విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా తన సొంత నియోజకవర్గంలోనే పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తిరుపతిలో పోటీ చేసినా ఎదుర్కొనే ధైర్యం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించిన ఆయన, అప్పట్లో వైసీపీ నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కోనసీమ ఘటనలు, కాపు యువకుడు వెంగయ్య మరణం వంటి సందర్భాల్లో కూడా వైసీపీ నేతలు స్పందించలేదని విమర్శించారు. ఎంత ప్రచారం చేసినా నిజాయితీ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ వెంటే కాపు సామాజికవర్గం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాదాసు నరసింహ, మద్దూరి మన్మధ, పెద్దంగారి సాయి, కావేరి అవినాష్, మాదాసు శివ, ఆనందల తేజ, కొనిశెట్టి చక్రి, సువారపు హరిప్రసాద్, మాదినేని రాజా తదితర జనసేన నాయకులు, కాపు యువత పాల్గొన్నారు.

