Sunday, 23 August 2026
  • Home  
  • సాధారణ ప్రయాణికుడిలా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్
- విశాఖపట్నం

సాధారణ ప్రయాణికుడిలా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్

భోగాపురం విమానాశ్రయంలో టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం విశాఖపట్నం జిల్లా, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత తొలిసారి సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్‌ ఫ్లైట్‌లో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖకు చేరుకున్నారు. భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, విష్ణుకుమార్‌ రాజు, ఈశ్వర్‌రావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తదితరులు ఘన స్వాగతం పలికారు. విజయనగరం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, విశాఖపట్నం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్‌, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో విమానాశ్రయ పరిసరాల్లో టీడీపీ శ్రేణుల సందడి నెలకొంది. కాగా, మంత్రి నారా లోకేష్‌ రేపు భీమిలి, విజయనగరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణులు, ప్రజలను కలుసుకోనున్నారు.

భోగాపురం విమానాశ్రయంలో టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం

విశాఖపట్నం జిల్లా, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత తొలిసారి సాధారణ ప్రయాణికులతో కలిసి కమర్షియల్‌ ఫ్లైట్‌లో విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖకు చేరుకున్నారు. భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, విష్ణుకుమార్‌ రాజు, ఈశ్వర్‌రావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి తదితరులు ఘన స్వాగతం పలికారు.

విజయనగరం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, విశాఖపట్నం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్‌, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో విమానాశ్రయ పరిసరాల్లో టీడీపీ శ్రేణుల సందడి నెలకొంది.

కాగా, మంత్రి నారా లోకేష్‌ రేపు భీమిలి, విజయనగరం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ శ్రేణులు, ప్రజలను కలుసుకోనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.