Sunday, 23 August 2026
  • Home  
  • బ్రిక్స్ మంత్రుల రాకతో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు
- విశాఖపట్నం

బ్రిక్స్ మంత్రుల రాకతో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 22: బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాల్లో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్షుక్ మాండవీయకు నోవాటెల్ హోటల్ వద్ద జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమావేశాలు నగరానికి ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకురానున్నాయి. కూటమి ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు, ఐటీ, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. బ్రిక్స్ సమావేశాల ద్వారా విశాఖలోని పర్యాటక, మౌలిక వసతుల సామర్థ్యాన్ని అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేసే అవకాశం లభించడంతో పాటు, నగర అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. విశాఖను రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 22:
బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రుల సమావేశాల్లో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్షుక్ మాండవీయకు నోవాటెల్ హోటల్ వద్ద జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

విశాఖ వేదికగా జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమావేశాలు నగరానికి ప్రపంచస్థాయిలో మరింత గుర్తింపు తీసుకురానున్నాయి. కూటమి ప్రభుత్వం విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు, ఐటీ, పారిశ్రామిక, పర్యాటక రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది.

బ్రిక్స్ సమావేశాల ద్వారా విశాఖలోని పర్యాటక, మౌలిక వసతుల సామర్థ్యాన్ని అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేసే అవకాశం లభించడంతో పాటు, నగర అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. విశాఖను రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.