Sunday, 23 August 2026
  • Home  
  • జనసేన కీలక బాధ్యతల్లో యనమల భాస్కర్
- తిరుపతి

జనసేన కీలక బాధ్యతల్లో యనమల భాస్కర్

జనసేన పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై చిట్వేల్ మండల జనసేన నాయకుడు ఆనాల సునీల్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం ప్రకటించిన 14 మంది సభ్యుల జాబితాలో భాస్కర్‌కు చోటు దక్కడం నియోజకవర్గ జనసైనికులకు ఆనందదాయకమని పేర్కొన్నారు. పార్టీ కోసం భాస్కర్ చురుగ్గా పనిచేస్తూ, జనసేన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని ఆనాల సునీల్ తెలిపారు. తాజాగా అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో భాస్కర్ మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టి జనసేన అభివృద్ధికి తనవంతు సహకారం అందించాలని కోరుకుంటున్నట్లు సునీల్ పేర్కొన్నారు.

జనసేన పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై చిట్వేల్ మండల జనసేన నాయకుడు ఆనాల సునీల్ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం ప్రకటించిన 14 మంది సభ్యుల జాబితాలో భాస్కర్‌కు చోటు దక్కడం నియోజకవర్గ జనసైనికులకు ఆనందదాయకమని పేర్కొన్నారు.
పార్టీ కోసం భాస్కర్ చురుగ్గా పనిచేస్తూ, జనసేన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారని ఆనాల సునీల్ తెలిపారు. తాజాగా అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో భాస్కర్ మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టి జనసేన అభివృద్ధికి తనవంతు సహకారం అందించాలని కోరుకుంటున్నట్లు సునీల్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.