రామచంద్రపురం ఆగస్టు ; పున్నమి ప్రతినిధి
రామచంద్రపురం మండలంలోని గ్రామంలో వరలక్ష్మీ వ్రత మహోత్సవాన్ని శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శ్రీశక్తి పీఠం పీఠాధిపతి రమ్యానంద
భారతి మహాస్వామిని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాతాజీ రమ్యానంద భారతి మాట్లాడుతూ.. ఎక్కడైతే స్త్రీలను గౌరవించి పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుందని అన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో ఉన్నతమైన స్థానం ఉందని, కుటుంబంలో స్త్రీలను గౌరవించడం ద్వారా సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయని తెలిపారు.
కార్యక్రమానికి హాజరైన మాతాజీ రమ్యానంద భారతి మహాస్వామినికి మండల టీడీపీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి కుటుంబ సభ్యులు పుష్పాలతో ఘన స్వాగతం పలికి పాదాభిషేకం నిర్వహించారు. అనంతరం పండితులు ప్రదీప్ అయ్యంగార్ ఆధ్వర్యంలో వరలక్ష్మీదేవిని విశేషంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, కార్యక్రమాలను నిర్వహించారు.
వ్రత
వరలక్ష్మీ వ్రతం విశిష్టతను పండితులు భక్తులకు వివరించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో రాయలచెరువులో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.


