Thursday, 20 August 2026
  • Home  
  • అర్ధనారీశ్వరాయానికి అపారమైన అభివృద్ధి సామర్థ్యం-జనసేన నాయకుడు నరేంద్ర
- తిరుపతి

అర్ధనారీశ్వరాయానికి అపారమైన అభివృద్ధి సామర్థ్యం-జనసేన నాయకుడు నరేంద్ర

శ్రీ కాళహస్తి, ఆగస్టు 19, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు దండి నరేంద్ర తెలిపారు. నూతనంగా AP-Green Executive Committee Chairman బాధ్యతలు చేపట్టనున్న కొణిదెల నాగబాబు ఈ పదవి ద్వారా మంచి ఫలితాలు సాధించాలని, పర్యావరణం, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్న ఆలయ చైర్మన్ సునీతను, ఆమెను ఎంపిక చేసిన ఎమ్మెల్యే బొజ్జా సుధీర్ రెడ్డిని అభినందించారు. ఆలయ చైర్మన్, ఇతర సభ్యులు, స్థానిక భక్తులతో చర్చించిన అనంతరం ఆలయాభివృద్ధికి పలు కీలక సూచనలు చేశారు. స్వయంభూ క్షేత్రమైన ఈ ఆలయానికి శివం-శివం రోడ్డు పనులను వేగవంతం చేసి రవాణా సౌకర్యం మెరుగుపరచాలని కోరారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ప్రధాన ఆలయం నుంచి సమీప ఆలయాలను కలుపుతూ ప్రత్యేక టెంపుల్ సర్క్యూట్, భక్తుల కోసం 10,000 లీటర్ల సామర్థ్యమున్న RO వాటర్ ప్లాంట్, 5+5 మరుగుదొడ్ల నిర్మాణం చేపట్ట్ాలని సూచించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో 6,000 మొక్కలతో గ్రీన్ ప్లాన్ అమలు చేయడం, స్వర్ణముఖి నది వైపు రక్షణ ప్రహరీ గోడ నిర్మించడం, రోజువారీ నిత్య అన్నదానం కోసం ఆధునిక కిచెన్ ఏర్పాటు చేయడం అత్యవసరమని తెలిపారు. అలాగే పూజా సామగ్రి దుకాణాలు, 20-25 గదులతో వసతి గృహం, పిల్లల కోసం ప్లే ఏరియా నిర్మించాలని కోరారు. ఈ సూచనలు అమలు చేస్తే నెలకు 3 లక్షల మంది భక్తుల రాకతో పాటు రూ. 1 కోటి ఆదాయం లభించే అవకాశముందని, NDA ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఈ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.